27 ఏళ్ల కల సాకారం.. అయోధ్యలో రామాలయం కోసం దీక్ష - MicTv.in - Telugu News
mictv telugu

27 ఏళ్ల కల సాకారం.. అయోధ్యలో రామాలయం కోసం దీక్ష

November 12, 2019

రామాయణంలో శ్రీరాముడు 14 ఏళ్లు మాత్రమే వనవాసం చేసి అన్ని వసతులకు దూరంగా అడవిలో ఉంటూ జీవించారు. కానీ ఓ బామ్మ మాత్రం రాముడి గుడిని అయోధ్యలో కట్టేందుకు కఠిన దీక్షను చేపట్టింది. 27 ఏళ్లుగా ఎటువంటి ఆహారం తీసుకోకుండా దీక్ష చేపట్టింది. అయోధ్యలో రాంలలాకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తోంది. త్వరలోనే తన దీక్ష విరమించబోతున్నట్టు ప్రకటించారు. 

Ayodhya Verdict.

మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు చెందిన సంస్కృత ఉపాధ్యాయురాలిగా పనిచేసిన 81 ఏళ్ల ఊర్మిళా చతుర్వేది రామ మందిర నిర్మాణం కోసం దీక్ష తీసుకున్నారు. బాబ్రీ మసీదు కూల్చేసిన రోజు నుంచి సాధారణ ఆహారం తీసుకోవడం మానేశారు. అప్పటి నుంచి పాలు, పళ్లు మాత్రమే తీసుకుంటూ జీవిస్తూ వచ్చారు. తాజాగా కోర్టు మందిరం నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తాను అయోధ్యలో రాముడిని దర్శించుకున్న తర్వాత తన దీక్షను విరమిస్తానని చెబుతున్నారు. హిందూ, ముస్లింలు బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత రక్తం చిందేడం తాను చూశానని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఎటువంటి వివాదం లేకుండా శాంతియుత వాతావరణంలో సమస్యకు పరిష్కారం లభించడం శుభపరిణామమని పేర్కొన్నారు.