అయోధ్య తీర్పు ఎవ్వరి విజయమూ కాదు..ప్రధాని మోదీ - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్య తీర్పు ఎవ్వరి విజయమూ కాదు..ప్రధాని మోదీ

November 9, 2019

దేశప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న వివాదాస్పద అయోధ్య భూమి కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరిస్తోంది. తీర్పు నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. అయోధ్యలో పెద్దసంఖ్యలో భద్రతా బలగాలను మోహరించింది. 

ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌లో స్పందించారు. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఎవరికీ విజయం కాదన్నారు. అలా అని ఓటమి కూడా కాదు. ఈ తీర్పు దేశ శాంతి, ఐక్యత, సద్భావన, గొప్ప సంప్రదాయాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. దేశ ప్రజలంతా శాంతి, సద్భావనతో మెలగాలని కోరుకుంటున్నాను. న్యాయవ్యవస్థ పట్ల గౌరవాన్ని కాపాడేందుకు సమాజంలోని అన్ని సామాజిక సాంస్కృతిక సంస్థలు కృషి చేస్తున్నాయి. గతంలో సామరస్యపూర్వక, సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి చేసిన ప్రయత్నాలను అన్ని పార్టీలు స్వాగతించాయి. కోర్టు తీర్పు తర్వాత సమాజంలో శాంతి నెలకొనేలా దేశమంతా కలసి నిలబడదామని పిలుపునిచ్చారు.