మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్ - MicTv.in - Telugu News
mictv telugu

మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్

August 13, 2020

AYUSH Minister Shripad Naik tested Covid positive

దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజుకి సగటున 50వేల కేసులు నమోదవుతున్నాయి. ఎందరో రాజకీయ ప్రముఖులు, కేంద్ర మంత్రులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మరో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ తదితరులు కరోనా వైరస్ బారిన పడ్డారు. 

తాజాగా ఆయుష్‌ శాఖ మంత్రి శ్రీపద్‌ నాయక్‌కు కరోనా సోకినట్టు తెలుస్తోంది. బుధవారం నిర్వహించిన కరోనా టెస్ట్ లో ఆయనకు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హోమ్ ఐసొలేషన్ లోకి వెళ్తున్నట్టు ట్వీట్‌ చేశారు. తనకు కరోనా లక్షణాలేవీ లేవని, ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. అయినప్పటికీ కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.