రాందేవ్ కరోనిల్ మందుకు కేంద్రం ఓకే.. ఈ రోజు నుంచే మార్కెట్లోకి.. - MicTv.in - Telugu News
mictv telugu

రాందేవ్ కరోనిల్ మందుకు కేంద్రం ఓకే.. ఈ రోజు నుంచే మార్కెట్లోకి..

July 1, 2020

Ayush Ministry Accept Patanjali Medicine

ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ఆయుర్వేద సంస్థ పతంజలి తయారు చేసిన కరోనా ఔషదంపై గందరగోళం నెలకొంది. ఓ సారి కరోనా మందుగా మార్కెట్లోకి వదిలిన తర్వాత ఆయూష్ మంత్రిత్వ శాఖ దాన్ని అడ్డుకుంది. ఆ తర్వాత అది అసలు కరోనాకు ముందే కాదంటూ ఇటీవల స్టేమెంట్ వచ్చింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ కూడా నడిచాయి. రకరకాల ఊహాగానాల మధ్యలో తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ‘కరోనిల్’‌కు కేంద్ర ప్రభుత్వం లైన్ క్లియర్ చేసినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. 

కరోనిల్ ఔషదాన్ని దేశవ్యాప్తంగా విక్రయించేందుకు అనుమతి లభించిందని పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ వెల్లడించారు.బుధవారం నుంచే దీన్ని మార్కెట్లో అమ్ముకోవచ్చని చెప్పిందని అన్నారు. దీంతో తమ షాపులతో పాటు యాప్‌లో ఆర్డర్‌ చేసిన వారికి ఇంటికే హోం డెలివరీ కూడా చేస్తామని తెలిపారు. పతంజలి పరిశోధనలకు సంబంధించిన వివరాలను ఆయూష్ మంత్రిత్వ శాఖకు అందజేశారు. వారం రోజుల్లో రోగులకు 100 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని వివరించారు. ఈ రీసెర్చి పత్రాలను పరిశీలించిన తర్వాత ఆమోదం లభించిందని రాందేవ్ బాబా వెల్లడించారు. ఎలాంటి లోహాలు లేకుండా అశ్వగంధ, తిప్పతీగ, తులసి వంటి మూలికలను వాడామని వివరించారు. అయినప్పటికీ జనంలో ఈ ఔషదంపై ఇంకా గందరగోళం మాత్రం ఇంకా వీడలేదు.