‘దీని పేరు జన్నీ.. నెలసరిలో భర్తకు వండిపెట్టి ఇలా పుట్టింది’ - MicTv.in - Telugu News
mictv telugu

‘దీని పేరు జన్నీ.. నెలసరిలో భర్తకు వండిపెట్టి ఇలా పుట్టింది’

February 21, 2020

cv bfbc

స్వామి నారాయణ్‌ భుజ్‌ మందిర్‌కు చెందిన కృష్ణస్వరూప్ దాస్‌జీ‌.. నెలసరి సమయంలో భర్తలకు వండిపెట్టిన స్త్రీలు వచ్చే జన్మలో కుక్కలై పుడతారని, ఆ వంట తిన్న భర్తలు ఎద్దులై పుడతారంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆయన వ్యాఖ్యాలపై బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్ ఖురానా, నటి లిసారే స్పందించారు. లిసారే ఓ కుక్క ఫోటోను ట్వీట్ చేస్తూ.. ‘దీని పేరు జిన్ని.. తను గత జన్మలో తను ఓ మహిళ. నెలసరి సమయంలో భర్తకు వండిపెట్టింది. అంతేగాక ఓసారి తన భర్తను కూడా వండి తినేసింది. అందుకే ఈ జన్మలో ఇలా కుక్కలా పుట్టి తన జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది. ఇక స్త్రీలంతా జిన్నిలా చేసి జీవితాన్ని ఆనందంగా గడపండి’ అంటూ ట్వీట్‌లో పేర్కొంది. ఆమె ట్వీట్‌కు చాలామంది ఫన్నీ మీమ్స్‌తో స్పందిస్తున్నారు.

మరోవైపు ఆయుష్మాన్‌ ఖురానా ట్వీట్ చేస్తూ.. ‘అవునా.. తనని అనుకరించే ముందు ప్రజలు కూడా ఎవరిని అనుకరిస్తున్నారో ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న సమాజంలో బతుకుతున్నాం. కాలానుగుణంగా మన ఆలోచనలు మారాలి. అయితే ఈ సమాజంలో రెండు రకాలుగా ఆలోచించే మనుషులు ఉన్నారు. కొంతమంది మారుతున్న కాలానికి అనుగుణంగా తమ ఆలోచనలను మార్చుకుంటుంటే.. మరికొందరు పాత పద్దతులనే ఆచరిస్తూ.. అవే సరైనవని బలంగా నమ్ముతారు. ఏదేమైనా ప్రజలు ప్రస్తుత సమాజాన్ని, మారుతున్న కాలాన్ని బట్టి నడుచుకోవాలన్న విషయాన్ని తప్పక అంగీకరించాల్సిందే’ అని తెలిపాడు.