అయ్యన్నపాత్రుడు.. రికార్డింగ్ డ్యాన్సర్లతో సయ్యా.. - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యన్నపాత్రుడు.. రికార్డింగ్ డ్యాన్సర్లతో సయ్యా..

April 13, 2018

ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు రికార్డింగ్ డ్యాన్లర్లతో డించిక్.. డించిక్ అని చిందులేశాడు. అశ్లీల భంగమలతో రెచ్చిపోతున్న డ్యాన్సర్లతో చేతులు కలిపి ఇరగదీశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను  ప్రజాప్రతినిధి అన్న సంగతి మరచిపోయి ఆయన చేసిన నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు ఏపీకి ప్రత్యేక హోదా జనం, నేతలు ఉద్యమిస్తోంటే ఈయన మరోలా ఉద్యమించేస్తున్నాడని అంటుననారు.

విశాఖ జిల్లా నర్సీపట్నంలో జరిగిన ఓ ప్రోగ్రాంలో అమాత్యువర్యులు డ్యాన్స్ చేశారు. రెచ్చిపోయి డ్యాన్సర్లపై డబ్బులు కూడా విసిరారు. గతంలో టీడీపీ మంత్రులు కొందరు ప్రభుత్వ ఉద్యోగినులపై దౌర్జన్యం చేశారని, ఇప్పుడు అయ్యన్న ఈ డ్యాన్స్ తో జనానికి ఏం సందేశమిస్తున్నారని వైకాపా వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.