అయ్యప్పమాల వేశారని.. ఉద్యోగాల్లోంచి తీసేశారు.. - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యప్పమాల వేశారని.. ఉద్యోగాల్లోంచి తీసేశారు..

January 17, 2020

Ayyappa mala.

అయ్యప్ప మాల వేసుకున్నాడని ఓ విద్యార్థిని స్కూల్‌లోకి అనుమతించని సంఘటన భువనగిరిలో జరిగిన సంగతి తెల్సిందే. తాజాగా అయ్యప్ప మాల వేశారని నలుగురిని ఉద్యోగాల నుంచి తొలగించడం అనంతపురం జిల్లాలో చర్చనీయయాంశం అవుతోంది. 

బాధితులు చరణ్‌రెడ్డి, బాలాజీ, సిద్ధారెడ్డి, సురేష్‌నాయక్ మూడేళ్లుగా తనకల్లు మండలంలోని ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఈనెల 12న కంపెనీ యాజమాన్యం వాళ్ళను ఉన్నఫళంగా ఉద్యోగాల నుంచి తొలగించింది. ఎందుకని ప్రశ్నించగా..మీరు అయ్యప్ప స్వామి మాల వేయడమే కాకుండా ప్లాంట్‌ ప్రాంగణంలో పూజలు కూడా చేశారని కంపెనీ యాజమాన్యం సమాధానమిచ్చింది. ఇలాంటి కారణాలతో తమ కడుపుకొట్టడం ఎంతవరకు సమంజసం అని ఉద్యోగులు వాపోతున్నారు. తాము విధుల పట్ల ఏనాడు నిర్లక్ష్యం చూపలేదని తెలిపారు. వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని కోరుతూ ప్లాంట్‌ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. ఏఎస్‌ఐ బాలరాజు, హెడ్‌ కానిస్టేబుల్‌ సూర్యనారాయణ, వైఎస్సార్‌సీపీ నాయకులు మధుసూదన్‌రెడ్డి తదితరులు ప్లాంట్‌ అధికారులతో చర్చించారు. ప్లాంట్‌ ముఖ్య అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పడంతో బాధితులు శాంతించారు.