శబరిమలలో కిందపడిన అయ్యప్ప.. ఏనుగు వీరంగం.. - MicTv.in - Telugu News
mictv telugu

శబరిమలలో కిందపడిన అయ్యప్ప.. ఏనుగు వీరంగం..

March 30, 2018

కేరళలోని అయ్యప్పస్వామి కొలువై ఉన్న  ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో అపశ్రుతి చోటుచేసుకుంది. శుక్రవారం  అయ్యప్ప జన్మదిన వేడుకల సందర్భగా ఊరేగింపు జరుగుతుండగా ఏనుగు వీరంగం సృష్టించింది. దీంతో అయ్యప్ప విగ్రహం కిందపడిపోయింది. ఊరేగింపు నీలిమలైలో సాగుతుండగా ఉత్సవం కోసం తెచ్చిన ఏనుగు భయంతో అదుపుతప్పింది. వాద్యాల శబ్దాలను, భక్తుల కోలాహలాన్ని తట్టుకోలేక ఇష్టమొచ్చినట్లు పరుగులు తీసింది. భక్తులు ప్రాణభయంలో పరుగెత్తారు. దీంతో తొక్కిసలాట జరిగి, పలువురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పోలీసులు కూడా ఉన్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఏం జరుగుతోందో తెలీని స్థితి. తొక్కిసలాట ఫలితంగా ఊరేగిస్తున్న అయ్యప్ప విగ్రహం కిందపడిపోయింది. స్వామివిగ్రహం కిందపడడం అపచారం కనుక పూజారు పాప పరిహార పూజలు చేశారు. తర్వాత కాసేపటికి మావటీలు ఎలాగోలా ఏనుగును అదుపులోకి తీసుకొచ్చారు.