ప్రియురాలు రంగులద్దుకున్న ఓ చేనేతచీర.. తమసోమా జ్యోతిర్గమయ వీడియో సాంగ్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియురాలు రంగులద్దుకున్న ఓ చేనేతచీర.. తమసోమా జ్యోతిర్గమయ వీడియో సాంగ్

March 23, 2021

01

‘అయ్యయ్యో అయ్యయ్యో ఏమాయో
కళ్లెదుటే ఉన్నావో అమ్మాయో
ఓ నవ్వే విసిరేస్తూ ఉందయ్యో..
ఆ రంగులద్దుకున్న చేనేత చీరలాగా
అందంగా ఉన్నావే ఓ రాక్షసి..
నీ చూపుతో చంపేసి వెళిపోకే.. ’

అంటూ అద్భుతంగా సాగుతుంది ‘తమసోమా జ్యోతిర్గమయ’ చిత్రంలోని ఓ పాట. యువదర్శకుడు విజయ్ కుమార్ బడుగు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇందులోని ‘అయ్యయ్యో ఏమాయె’ పాట లిరిక్స్ వీడియో మూవీ టీమ్ ఈ రోజు విడుదల చేసింది.
చేనేత కార్మికుడైన కథానాయకుడు తన ప్రియురాలని తలచుకుంటూ పాడే ఈ పాట చాలా సహజంగా సాగుతుంది. ఆమెను అతడు రంగులదుకున్న చేనేత చీరగా పోల్చుతాడు. ప్రశాంత్ బీజే రాసి, సంగీతం సమకూర్చిన ఈ పాటను ఐశ్వర్య, ధనుంజయ్ ఆలపించారు.
చేనేతకార్మికుల జీవితాన్ని అద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రివ్యూ షోను ఇటీవల ప్రదర్శించారు. 2000 సంవత్సరం నుండి 2014 మధ్య చేనేత ప్రసిద్ధి పొందిన పోచంపల్లిలో జరిగిన ఓ సంక్లిష్ట పరిస్థితి నుండి చేనేత పరిశ్రమను ఓ యువకుడు ఎలా గట్టెక్కించాడనే ఇతివృత్తంతో విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.