Ayyo .. it's not real meat: the video is viral
mictv telugu

అయ్యో పాపం.. అది నిజమైన మాంసం కాదు: వీడియో వైరల్

June 25, 2022

 

సోషల్ మీడియాలో ఓ కుక్కకు సంబంధించి వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను వీక్షిస్తున్న నెటిజన్లు అయ్యో పాపం..అది నిజమైన మాంసం కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు తెగ నవ్వుకుంటున్నారు. అసలు ఆ వీడియోలో ఏముంది? ఆ కుక్క ఏ మాంసం కోసం ఆరాటపడింది? అనే వివరాల్లోకి వెళ్తే..

 

ఇంట్లో ఉన్న వ్యక్తులతోపాటు ఓ పెంపుడు కుక్క టీవీ చూస్తోంది. అంతలోనే ఆ టీవీలో అడ్వర్టైజ్‌మెంట్ వచ్చింది. అందులో మాంసం ముక్కలు కనిపించడంతో, టీవీ ముందు కూర్చున్న ఆ కుక్క ఒక్కసారిగా తోక ఊపుతూ, ఆ ముక్కను అందుకోవాలని తెగ ప్రయత్నిస్తుంది. పాపం అది నిజమైన మాంసం ముక్క అని దానికి తెలియదు కదా. ఆ కుక్క టీవీ స్క్రీన్‌ను నాకుతూ ఆస్వాధించింది. అయితే, కుక్క అలా చేయడాన్ని వీడియో తీసిన యజమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక ఏముంది నెటిజన్స్ షేర్ల మీద షేర్లు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆ వీడియోను 9.1 మిలియన్ల మంది వీక్షించగా, 65 వేల పైగా లైక్స్ వచ్చాయి.