మాట మార్చిన కాంగ్రెస్.. మాకే పట్టం కట్టాలి!  - MicTv.in - Telugu News
mictv telugu

మాట మార్చిన కాంగ్రెస్.. మాకే పట్టం కట్టాలి! 

May 17, 2019

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ మాట మార్చారు. బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని.. ప్రధాని పదవిపై ఆశేలేదని అన్న ఆజాద్ ఒక రోజుకూడా  గడవక ముందే మాట తీసి గట్టున పెట్టారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం కావాలంటే కాంగ్రెస్‌ పార్టీకే మద్దతు ఇవ్వాలని గురువారం వ్యాఖ్యానించారు. పరోక్షంగా కాంగ్రెస్‌‌కే పట్టం కట్టబెట్టాలని అన్నారు. కాంగ్రెస్‌‌కు ప్రధాని పదవిపై మోజులేదన్నదాంట్లో నిజం లేదని అన్నారు. దేశంలో కాంగ్రెస్‌కు సుదీర్ఘ చరిత్ర వుందని.. అతిపెద్ద పార్టీ తమదేనన్నారు. తమకే అవకాశం ఇవ్వాలని స్పష్టంచేశారు.

Azad does a u-turn.

‘ఎన్నికలు జరుగుతున్న సమయంలో మనలో మనమే ప్రధాని పదవి కోసం ఘర్షణ పడటం అంత శ్రేయస్కరం కాదని ముందు నుంచే చెబుతున్నాను. సంప్రదింపుల ద్వారా ఈ అంశాన్ని పరిష్కరించుకోవాలి. ఎన్నికల తరువాత కాంగ్రెస్సే అతి పెద్ద పార్టీగా నిలుస్తుంది. 273 సీట్లు కచ్చితంగా గెలుచుకుంటుంది. అది మాకు పెద్ద లక్ష్యమే కాదు. ఈ ఎన్నికల్లో మా ముఖ్య లక్ష్యం బీజేపీని గద్దె దించడమే.. పీఎం పదవి మాకు పెద్ద సమస్య కాదు’ అని వ్యాఖ్యానించారు ఆజాద్.