ఆర్మీనియా, అజర్‌బైజాన్‌ల మళ్లీ యుద్ధం.. ఇప్పటికే 400 మంది బలి  - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్మీనియా, అజర్‌బైజాన్‌ల మళ్లీ యుద్ధం.. ఇప్పటికే 400 మంది బలి 

October 12, 2020

Azerbaijan-Armenia war restart

ఆర్మీనియా, అజర్‌బైజాన్ దేశాల మధ్య ఆగిందనుకున్న యుద్ధం మళ్ళీ మొదలైంది. ఈ దేశాల సరిహద్దులో ఉన్న వివాదాస్పద నాగోర్నో కారాబఖ్ భూభాగంపై ఆధిపత్యం కోసం ఈ యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధానికి ప్రస్తుతం తాత్కాలికంగా బ్రేక్ పడింది. సెప్టెంబర్ 27 నుంచి జరుగుతున్న ఈ యుద్ధంలో దాదాపు 400 మంది మృతిచెందారు. రష్యా రంగంలోకి దిగడంతో ఈ యుద్దానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. 

రష్యా దేశం పెద్దన్నలా వ్యవహారించి మాస్కోలో ఇరు దేశాల మధ్య చర్చలు జరిపింది. ఈ చర్చల్లో కాల్పులను ఆపడానికి రెండు దేశాలు ఒప్పుకున్నాయి. ఈ ఆదివారం నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమలుకానుంది. కాల్పుల్లో మరణించిన వారి మృతదేహాలను, ఖైదీలను అప్పగించేందుకు ఒప్పందం కుదిరినట్లు రెండు దేశాల దౌత్యాధికారులు తెలిపారు. తాజాగా సమాచారం ప్రకారం ఈ యుద్ధం మళ్ళీ మొదలైందని తెలుస్తోంది. ఈరోజు ఆర్మేనియా సైనిక దళాలు అజర్‌బైజాన్‌పైకి క్షిపణి దాడులకు పాల్పడింది. తమ దేశంలోని రెండో అతి పెద్ద నగరం గాంజాలో ఆర్మేనియా జరిపిన క్షిపణి దాడుల్లో కనీసం తొమ్మిది మంది అమాయకపౌరులు మరణించారని అజర్‌బైజాన్‌ ఆరోపిస్తోంది.