బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.. పక్కింటి ఆంటే, అంకులే కారణం!  - MicTv.in - Telugu News
mictv telugu

బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.. పక్కింటి ఆంటే, అంకులే కారణం! 

February 29, 2020

B Tech Student

హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఎల్బీనగర్‌కు చెందిన శ్రీధర్ ఇంట్లో ఉరి వేసుకున్నాడు. తన చావుకు పక్కింటి వారే కారణమని ఓ లెటర్ కూడా రాసి పెట్టాడు. కొడుకు జీవితం అర్థాంతంరంగా ముగిసిపోవడంతో అతని తల్లిదండ్రులు తీవ్ర విచారంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

శ్రీధర్ చనిపోయే ముందు ఓ లేఖను రాసి పెట్టాడు. దాంట్లో పక్కింట్లో ఉండే అనసూర్య, ఆమె భర్త దశరథ్ కారణమని పేర్కొన్నారు. వారు తన జీవితాన్ని నాశనం చేశారని పేర్కొన్నాడు. ఆ ఇద్దరి వల్లే తాను ప్రాణాలు విడుస్తున్నానని  పేర్కొన్నాడు. దీంతో లేఖ ఆధారంగా పక్కింటి వారికి ఇతనికి ఉన్న సంబంధం ఏంటీ.? ఇంతకీ వారి మధ్య ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కాగా ఇటీవల వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలో తరుచూ వెలుగులోకి వస్తునే ఉన్నాయి. చిన్నపాటి సమస్యలకే ఇలా ప్రాణాలు విడవటంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.