ఒక్క గొర్రెపిల్ల ధర రూ. 10 లక్షలు.. అందమే అందనిదై.. - MicTv.in - Telugu News
mictv telugu

ఒక్క గొర్రెపిల్ల ధర రూ. 10 లక్షలు.. అందమే అందనిదై..

February 4, 2020

sheep

మామూలుగా ఒక గొర్రెపిల్ల ధర ఎంత ఉంటుంది? మహా అయితే మూడు, నాలుగు వేలు. మాంచి బలిష్టమైన జాతిదైతే ఓ ఐదు వేలు. కానీ ఆ గొర్రెపిల్ల ధర రూ. 10 లక్షలు. అంటే మామూలు గొర్రె పిల్లలకన్నా వాటి ధర దాదాపు 40, 50 రెట్లు ఎక్కువన్నమాట. ఏంటి,  గొర్రెకు అంత రేటా? దాంట్లో అంత స్పెషాలిటీ ఏంటి? అని ఆశ్చర్యపోకండి. ఆ గొర్రెలు మిగతా గొర్రెల్లా నల్లగా ఉండవు.. అందంగా ఉంటాయి. అందుకే వాటిని అంత రేటు పెట్టి కొంటారు. స్విట్జర్లాండ్‌, లండన్ లాంటి దేశాల్లో వాటిని పెంపుడు కుక్కల్లా పెంచుకుంటారు. ‘వలాయిస్‌’ జాతికి చెందిన ఈ గొర్రెలు ప్రపంచ గొర్రెల జాతుల్లోకెల్లా అత్యంత అందంగా ఉంటాయి. ఈ జాతికి నుంచి ఉన్ని ఎక్కువ రావడమే కాకుండా మాంసం కూడా భలే రుచిగా ఉంటుందట.

ఇంగ్లండ్‌లోని ఉత్తర డెవాన్‌లో వారం క్రితం ఈ జాతికి చెందిన మూడు గొర్రె పిల్లలు ఫామ్‌లో జన్మించాయి. అవి ఎంతో ముద్దుగా, అందంగా ఉన్నాయి. వాటిని విక్రయించాలనుకున్న యజమాని ఒక్కో గొర్రె పిల్లకు పది లక్షల రూపాయలు చెబుతున్నాడు. ఇప్పుడు అక్కడ గొర్రెల అమ్మకానికి మంచి సీజన్‌. క్రిస్‌ స్లీ, టామ్‌ హూపర్‌ అనే గొర్రెల పెంపకం దార్లు 2016లో వలాయిస్‌ జాతి గొర్రెల పిండాలను స్కాట్‌లాండ్‌ నుంచి తీసుకొచ్చి డెవాన్‌ ఫామ్‌లో పెంచుతున్నారు. లండన్‌ మొత్తం మీద ఈ జాతి గొర్రెలు కొన్ని వేలల్లోనే ఉంటాయని, స్విడ్జర్లాండ్‌ ఎగుమితి నిషేధంతో ఈ జాతి గొర్రెలు ఎక్కువ కావాలన్నా దొరకవని హూపర్‌ తెలిపారు. కాగా, ఏడేళ్ల క్రితం విదేశాలకు గొర్రెల ఎగుమతిని స్విడ్జర్లాండ్‌ నిషేధించింది.