ఇలియానా డీ గ్లామర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇలియానా డీ గ్లామర్

June 17, 2017

పోకిరి సినిమాతో పోరగాళ్ళకు దివాన్ లేపిన పోరి ఇలియానా. తన నడుమును డ్రీమ్స్ లో కొలిచిన కుర్రకార్లెందరో.. క్రేజును ఖతర్నాక్ గా మలుపుకున్న పొల్ల ఇలియానానే. ఫస్ట్ లో గీ పిల్ల తేజ డైరెక్షన్ లో ధైర్యం సినిమాలో హీరోయిన్ గా నటించాల్సింది. కానీ తేజకి ఇలియానా ఎందుకో తన పాత్రకు సెట్టవదనిపించి క్యాన్సిల్ చేసేసాడట. రైమా సేన్ ఆ ప్లేసులోకి తీస్కున్నాడు. కొన్ని మనమంచికే జరుగుతాయంటారు. ఇలియానా విషయంలో కూడా అదే జరిగింది. వైవియస్ చౌదరి దర్శకత్వంలో దేవదాసు సినిమాతో మాంచి బోణి ఇచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఫిల్మే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పోకిరి చేసింది.

ఒక్కసారిగా పోకిరి హిట్టుతో ఇలియానా టాప్ హీరోయిన్ గా ఎదిగింది. వరుసగా తెలుగులో చాలా సినిమాలే చేసింది. ఇక్కడ ఒక దురదృష్టం ఏంటేంటే నార్త్ నుండి హీరోయిన్లు గా వస్తున్న అమ్మాయిలందరూ బాలావుడ్ లో పాగా వెయ్యటానికి టాలీవుడ్ ని ఒక క్వాలిఫికేషన్ లాగ వాడుకుంటున్నారు.
అలా ఇలియానా కూడా అనుకొంది. హిందీలో బర్ఫీ చిత్రం చేసింది. అది సూపర్ హిట్టయింది. ఆ తర్వాత మైతేరా హీరో, హ్యాప్పీ ఎండింగ్, రుస్తుం సినిమాలు చేసింది. కానీ తనకు బర్ఫీ, రుస్తుం సినిమాలు మంచి పేరును తీస్కొచ్చాయి. ఇప్పడు తాజాగా మిలన్ లుత్రియా డైరెక్షన్ లో ‘ బాద్ షాహో ’ అనే పీరియాడికల్ సినిమా చేస్తోంది. ఇందులో అజయ్ దేవ్ గణ్, ఇమ్రాన్ హష్మీలు కూడా నటిస్తున్నారు. 1970 దశకానికి సంబంధించిన కథ. ఇందులో తను పూర్తి డీ గ్లామర్ రోల్ చేస్తోందట. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్ సభ్యులు. చూడాలి మరి ఈ సినిమాతోనైనా ఇలియానా ఏ రేంజుకు వెళుతుందో..