బాహుబలికి మరో అరుదైన గౌరవం.. - MicTv.in - Telugu News
mictv telugu

బాహుబలికి మరో అరుదైన గౌరవం..

October 20, 2019

‘బాహుబలి’.. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన సినిమా. ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ బాహుబలికి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. ‘బాహుబలి’ సినిమాను లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శిస్తున్నారు. 

రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో గత 148 సంవత్సరాలుగా ప్రసిద్ధి చెందిన ఇంగ్లీష్ సినిమాలను మాత్రమే ప్రదర్శిస్తూ వస్తున్నారు. కాగా, మొదటిసారిగా ఇంగ్లీష్ యేతర సినిమాను ప్రదర్శించడం విశేషం. అది కూడా తెలుగు సినిమా అయి ఉండడం గమనార్హం. ఈ ప్రదర్శన కోసం బాహుబలి టీం లండన్‌లో కలుసుకున్నారు. బాహుబలి దర్శకుడు రాజమౌళి, నటీనటులు ప్రభాస్, రానా, అనుష్క, నిర్మాత శోభు యార్లగడ్డ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో జరిగిన ఆ ప్రదర్శనకు హాజరయ్యారు.