నా దృష్టిలో బాబా భాస్కరే విన్నర్..శ్రీముఖి - MicTv.in - Telugu News
mictv telugu

నా దృష్టిలో బాబా భాస్కరే విన్నర్..శ్రీముఖి

November 11, 2019

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 రియాల్టీ షో ముగిసి రోజులు గడుస్తున్నా కంటెస్టెంట్లు, ప్రేక్షకులు ఇంకా ఆ మేనియా నుంచి బయటికి రాలేదు. సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

sree mukhi.

అయితే బిగ్ బాస్ షో ముగిసిన తరువాత మాల్దీవులకు విహారయాత్ర కోసం వెళ్లిన శ్రీముఖి స్వదేశం తిరిగొచ్చింది. ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో లైవ్‌లోకి వచ్చి బిగ్ బాస్ సీజన్ 3 పై తన అభిప్రాయాలు వెల్లడించింది. ఈ సీజన్‌లో బాబా భాస్కరే అసలైన విజేత అని శ్రీముఖి అభిప్రాయపడింది. బాబా భాస్కర్‌తో పరిచయం అయిన తర్వాత ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపింది. అన్ని కోణాల్లోనూ భాస్కర్ పెర్ఫార్మెన్స్ బాగుందని, టాస్కులు చేయడంలోనూ, కిచెన్‌లోనూ, వినోదం పండించడంలోనూ, వంట చేయడంలోనూ బాబా తర్వాతే ఎవరైనా అని కితాబిచ్చింది. తనవరకు బాబానే విజేత అని స్పష్టం చేసింది. రాహుల్‌తో తనకు బిగ్ బాస్‌కి రాకముందే పరిచయం ఉందని, కానీ బిగ్ బాస్‌లో స్నేహం కొనసాగించడం కుదరలేదు, ఇద్దరి మధ్య కొన్నిరోజులకే విభేదాలు వచ్చాయని వెల్లడించింది.