డేరా బాబా ఎస్కేప్ యత్నం.. - MicTv.in - Telugu News
mictv telugu

డేరా బాబా ఎస్కేప్ యత్నం..

August 30, 2017

రేప్ కేసుల్లో దోషిగా తేలిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీం బాబాను పోలీసు కస్డడీ నుంచి తప్పించడానికి అతని పక్కా పథకం వేసి అమలు చేశారు. అయితే పోలీసులు అప్రమత్తం కావడంతో వారి యత్నం విఫలమైంది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ ఐఆర్లో ఈమేరకు వెల్లడించారు. శుక్రవారం దోషిగా తేలిన బాబాను పోలీసు కస్డడీ నుంచి తప్పి రహస్య ప్రాంతానికి తరలించాలని డేరాలు ప్లాన్ చేశారు. బాబా  పంచకుల కోర్టు నుంచి బయటకు వచ్చేటప్పుడు అతనికి కాపలాగా ఉన్న పోలీసులపై దాడి చేయాలని అనుకున్నారు. బాబాను పోలీసులు స్కార్పియో కారులో ఎక్కించుకుని కోర్టు భవన సముదాయం నుంచి బయటకు వచ్చేటప్పుడు వారిపై మూకుమ్మడిగా దాడి చేయాలనుకున్నారు. స్కార్పియో కారు కోర్టు  బయటకు రాగానే తమ కారుతో అడ్డగించారు డేరాలు. అయితే పోలీసులు వారిని తరిమికొట్టారు. ఆ ప్రాంతంలో పోలీసులతోపాటు పారా మిలటరీ జవాన్లు కూడా సంఖ్యలో ఉండడంతో వారి యత్నం ఫలించలేదు.

2002లో ఇద్దరు సాధ్విలపై అత్యాచారం చేసిన కేసులో పంచకుల కోర్టు బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 30 లక్షల జరిమానా విధించడం, అతని అనుచరులు రేపిన అల్లర్లలో 32 మంది చనిపోవడం తెలిసిందే.