త్వరలో బాబా రాందేవ్ బ్రాండెడ్ బట్టలు ! - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలో బాబా రాందేవ్ బ్రాండెడ్ బట్టలు !

August 3, 2017

బాబా రాందేవ్ పతంజలి గ్రూప్ నుండి మరొక కబురు. అదేంటంటే పతంజలి బట్టలు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. అవునూ ఇక నుండి చాలా మంది పతంజలి బట్టలు ధరిస్తారేమో. పతంజలికున్న ఇమేజిని బట్టి ఏప్రిల్ 2018 నుండి మార్కెట్లో ఏ వస్త్ర దుకాణంలో చూసినా పతంజలి బ్రాండ్సే కనిపించేటట్టున్నాయి. ‘ పరిధాన్ ’ పేర ఈ వస్త్రాలు పతంజలి బ్రాండ్ నేమ్ ను మరింత పెంచనున్నాయని ఆ సంస్థ ప్రతినిధి తిజారావాలా తెలిపారు. స్టార్టయిన మొదటి సంవత్సరం 5,000 కోట్ల రూపాయల టార్గెట్ ను రీచ్ అయ్యేలా పకడ్బందీ ప్లానింగ్ తో మానుఫ్యాక్చరింగ్ మొదలైందట. ఊలు, కాటన్, నైట్ వేర్, మెషీన్ మేడ్, డెనిమ్ వంటి తరీక తరీక బట్టలను తీస్కస్తరట. పతంజలి లేబుల్ తో ఇంకా వివిధ బ్రాండ్ల ఉత్పత్తిని పెంచే ప్రయత్నం కూడా చేస్తారట.

ఇప్పటికే మార్కెట్లో పతంజలి సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ప్యూర్ దేశీ ఉత్పత్తుల పేరుతో జనాలను ఆకర్షించగలిగారు. ఇప్పుడు బట్టల వ్యాపారంలోకి దిగారంటే తప్పకుండా పతంజలి బ్రాండ్ బట్టలు ఫుల్లు సేల్ అవడం ఖాయం అంటున్నారు పతంజలి వినియోగదారులు. చూడాలి మరి బాబా రాందేవ్ బట్టల వ్యాపారం ఎన్ని సంచలనాలు సృష్టించనున్నదో !?