ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బాబా రామ్‌దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవం, ఇస్లాంల లక్ష్యం మతమార్పిళ్లేనని, సనాతన హిందూ ధర్మం గొప్పదని అన్నారు. ‘‘ముస్లిం, క్రైస్తవ మతాల అజెండా ఒక్కటే. ఇతర మతాల వారిని తమ మతంలోకి మార్చడం. మొత్తం ప్రపంచాన్ని ఇస్లాంమయం చేయాలనో, క్రైస్తవంలోకి మార్చాలనో నిత్యం పనిచేస్తుంటారు. ప్రార్థనలతో, కొవ్వొత్తులతో పాపాలు పోతాయనుకుంటారు’’ అని అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తుండగా తీసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఇదెప్పటి వీడియోనో తెలియడం లేదు.
రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తే పాపాలు తొలగిపోతాయనుకుంటారని, కానీ హిందూ మతంలో ఇలాంటివేవీ లేవని బాబా పేర్కొన్నారు. ‘‘ముస్లింలు ఐదు సార్లు నమాజ్ చేసి మనసుకు తోచిన పాపాలు చేస్తారు. హిందూ అమ్మాయిలను తీసుకెళ్తారు. ఉగ్రవాదులు అవుతారు. వారిలో చాలామంది నేరస్తులే. పాపం చేశాక నమాజ్ చేస్తే సరిపోతుందనని వారికి నేర్పారు. కానీ హిందూ మతం అలా చెప్పదు. అది సనాతన ధర్మాన్ని నేర్పిస్తుంది. యోగా చేయాలంటుంది. హింస వద్దంటూ మంచి పనులను ప్రోత్సహింస్తుంది..’’ అని రామ్‌దేవ్ అన్నారు.
ఇవి కూడా చదవండి :
జూ.ఎన్టీఆర్‌తో లాభం లేదు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్‌కు అక్బరుద్దీన్‌కు మధ్య ఫైట్