వావ్..బాబా రాందేవ్ సెక్యూరిటీ ఏజెన్సీ..! - MicTv.in - Telugu News
mictv telugu

వావ్..బాబా రాందేవ్ సెక్యూరిటీ ఏజెన్సీ..!

July 13, 2017

యెగా టిప్స్ ఇచ్చే బాబా రాందేవ్‌.. బిజినెస్ ట్రిక్స్ లో అంబానీలతో పోటీపడగలడు. పతంజలితో ఇప్పటివరకు పట్టిందల్లా బంగారమైంది. మల్టీ నేషనల్ కంపెనీలను తోక ముడిచేలా చేశాడు. వేల కోట్ల తో మొదలైన వ్యాపారాన్ని 25 వేల కోట్లకు పడగలెత్తించారు. అంతే కాదు ఇప్పుడు లాభాదాయకమైన భద్రతా వ్యాపారాల్లోకి ఎంటర్ అయ్యారు. అన్నింటిలాగే ఇది కలిసి వస్తుందా..?

యోగా గురు రాందేవ్ బాబా ఏదీ వదలడం లేదు. క్రమంగా అన్ని రంగాల్లోకి దూకేస్తున్నారు. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులతో ఎఫ్‌ఎంసీజీ మార్కెట్లో దుమ్మురేపిన బాబా..ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థను ఏర్పాటు చేశారు. ”పరాక్రమ్‌ సురక్ష ప్రైవేట్‌ లిమిటెడ్‌” పేరుతో భద్రతా సంస్థ పెట్టేశారు.

ఈ సెక్యురిటీ సంస్థ ద్వారా దేశంలో 20-25వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రతిఒక్కర్ని వ్యక్తిగతం రక్షణ కోసం, దేశభద్రతా విధుల కోసం సన్నద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రిక్రూట్‌ చేసుకున్న యువతకు శిక్షణ ఇవ్వడానికి పదవీ విరమణ పొందిన ఆర్మీ, పోలీసు అధికారులను నియమిస్తున్నారు.

హరిద్వారలోని పతంజలి క్యాంపస్‌లో యువతకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. రాందేవ్‌ బాబా ఎఫ్‌ఎంసీజీ వ్యాపారాలు 2016 నాటికి రూ.1,100 కోట్లుగా ఉన్నాయి. అదేఏడాది రాందేవ్‌ బాబా పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ సంపద రూ.25,600 కోట్లకు ఎగబాకి భారత్‌లో 25వ ధనికవంతుడిగా నిలిచారు. ఎఫ్‌ఎంసీజీ వెంచర్‌లో తమ ఉత్పత్తులను విస్తరించుకుంటూ పోతూ…. ఎంఎన్‌సీలకు, దేశీయ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలకు రాందేవ్‌ చుక్కలు చూపిస్తున్నారు.