రాందేవ్ కు పోటీగా రవిశంకర్ - MicTv.in - Telugu News
mictv telugu

రాందేవ్ కు పోటీగా రవిశంకర్

August 22, 2017

ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన పంతజలి ఆయుర్వేద ఉత్పత్తులకు మరో ఆధ్యాత్మిక వేత్త నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ తన ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని ఇక ఆయుర్వేద మార్కెట్లోకి కూడా విస్తరించనున్నారు. త్వరలో దేశవ్యాప్తంగా వెయ్యి రిటైర్ స్టోర్లను శ్రీశ్రీ ఆయుర్వేద ట్రస్ట్ ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారావ ఆయుర్వేదిక్‌ సబ్బులు, టూత్‌పేస్టులు, ఆహార పదార్థాలు, సుగంధ ద్రవ్యాలు వంటి వాటిని విక్రయిస్తారు. వచ్చే నెలలో తొలి షాపును, ఈ ఏడాది నవంబర్ నాటికి 50 షాపులను తెరవాలన్నది లక్ష్యం. వీటితోపాటు పలు చోట్ల ఆయుర్వేద క్లినిక్ లను ఏర్పాటు చేయడానికి కూడా శ్రీశ్రీ ఆయుర్వేద ట్రస్ట్ కసరత్తు చేస్తోంది.

దేశంలో ఆయుర్వేద ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆధ్మాత్మిక వేత్తలు ఈ రంగంపై దృష్టి సారించారు. దీనికితోడు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆయుర్వేద, యునాని వంటి సంప్రదాయ ఉత్పత్తులు, ఔషధాల ప్రచారానికి ప్రాధాన్యమిస్తోంది.