ఓ బాబా.. ఓ బ్లూ ఫిల్మ్.. ఓ రేప్! - MicTv.in - Telugu News
mictv telugu

ఓ బాబా.. ఓ బ్లూ ఫిల్మ్.. ఓ రేప్!

August 26, 2017

అది 2002 సంవత్సరం.. ఓ  రోజు రాత్రి పదిగంటల సమయం..  డేరా బాబా గుర్మీత్ రాం రహీమ్ సింగ్ నుంచి ఒక భక్తురాలకి పిలుపొచ్చింది. ఆమె  ఆశ్రమంలోని నేలమాళిగలో ఉంటున్న అతని గదిలోకి వెళ్లింది. బాబా గదిలో మంచంపై పడుకుని ఉన్నాడు.. ఎదురుగా టీవీలో బ్లూ ఫిల్మ్ చూస్తున్నాడు.. చేతిలో రిమోట్ ఉంది. దిండు పక్కన రివాల్వర్ పెట్టుకున్నాడు.. భక్తురాలు వచ్చింది.. అక్కడి సీన్ చూసి షాకైంది. తాను గురువుగా భావించే వ్యక్తేనా ఇతడు? ఏమిటీ ఈ ఘోరం..? అని దిగ్ర్భాంతి చెందింది. బాబా అది గమనించాడు.. ‘‘భయపడకు.. నేను దేవుణ్ని.. నేనేం చేసినా సరైందే.. ’’ అంటూ ఆమెను మెల్లగా తనవైపుకు లాక్కున్నాడు. ఆమె ప్రతిఘటించినా వదల్లేదు.. ఆ అభాగ్యురాలపై అత్యాచారానికి పాల్పడ్డాడు..

ఈ అత్యాచార బాధితురాలు.. అప్పట్లో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయికి, రాష్ట్ర పోలీసు అధికారులకు రాసిన లేఖలోనిది పైన చెప్పిన ఉదంతమంతా. బాబాను రేప్ కేసులో కోర్టు దోషిగా తేల్చిన నేపథ్యలో ఈ లేఖలోని విషయాలు మరింత వివరంగా బయటకొచ్చాయి.

బాబా తాను దేవుణ్నని తనకు చెప్పాడని ఆమె లేఖలో రాసింది. లేఖ ప్రకారం..

‘‘నన్ను మీరు బలాత్కారం చేయడం అన్యాయం కదా? మీరు మా గురువు కదా.. ఈ ఘోరాన్ని దేవుడు ఒప్పకుంటాడా?’’ అని బాధితురాలు బాబాను అడిగింది.

అందుకు బాబా ఇలా చెప్పాడు..

‘‘శ్రీకృష్ణుడికి 360 మంది గోపికలు ఉన్నా ఆయనను మనం పూజిస్తున్నాం కదా.. ఇదేం కొత్త విషయం కాదు.. నువ్వు నా ప్రియమైన సాధ్వివి. నీకు ఈ హోదా ఇచ్చాను తీసుకో.. నేను దేవుణ్ని.. ఇందులో అనుమానమే లేదు.. ’’

అత్యాచారం తర్వాత కూడా బాధితురాలని బాబా వేధించాడు.. తను అడినప్పుడల్లా కోరిక తీర్చకపోతే ఆమె కుటుంబాన్ని అంతమొందిస్తానని బెదిరించాడు. తర్వాత మూడేళ్లపాటు బాబా ఆమెపై పలుసార్లు అత్యాచారం చేశాడు. ఆశ్రమంలోని ఇతర భక్తురాళ్లపైనా బాబా అఘాయిత్యాలు పాల్పడేవాడని బాధితురాలు తెలిపింది. వాళ్లంతా 35, 40 ఏళ్ల వయసు మధ్యలోని వారని, బయటికెళ్లి పెళ్లి చేసుకునే అవకాశం లేకపోవడంతో బాబా కామవాంఛలకు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. బాబాను ప్రతిఘటించిన బాలికలను ఆశ్రయ నిర్వాహకులు కర్రతో కట్టేవారని, ఇతర వేధింపులకు పాల్పడేవారని తెలిపింది. దాదాపు 40 మంది మహిళలపై బాబా అఘాయిత్యాలకు పాల్పడ్డారని వెల్లడించింది.