బాబానా?.. ఫ్యాక్షనిస్టా? - MicTv.in - Telugu News
mictv telugu

బాబానా?.. ఫ్యాక్షనిస్టా?

August 25, 2017

ఫ్యాక్షనిజం సినిమాల్లో విలన్లు.. అప్పుడప్పుడూ హీరోలూ.. కోర్టుకు మందీమార్బలంతో, పదిరవై జీపుల్లో వస్తుంటారు. ఆ ఆర్భాటాన్ని చూసి కోర్టులు భయపడవుగాని, జనాన్ని భయపెట్టడానికి ఫ్యాక్షనిస్టులు అలా చేస్తుంటారు. రేప్ కేసులో నిందితుడైన గుర్మీత్ బాబా ఇప్పుడు ఇలాంటి ఫ్యాక్షనిస్టు అవతారం ఎత్తాడు. కేసులో తీర్పు ఇవ్వబోతున్న పంచకులలోని కోర్టుకు 100కు పైగా వాహనాల్లో వెళ్లాడు. వేలమంది అనుచరులు ఆయనను అనుసరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు హెలికాప్టర్ లోనూ నిఘా ఉంచారంటే బాబా హల్ చల్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బాబా బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంలో బాబా కోర్టుకు వచ్చారు. ఆయన ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా హెలికాప్టర్ లో కోర్టుకు చేరుకోవాలనుకున్నారని, కానీ బలప్రదర్శన కోసం తర్వాత నిర్ణయం మార్చుకుని ఊరేగింపులా కాన్వాయ్ లో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

కేసులో తీర్పు బాబాకు వ్యతిరేకంగా వస్తే పంజాబ్, హరియాణాల్లో భారీ విధ్వంసం చెలరేగే అవకాశముంది. దీంతో పోలీసులు పలు పట్టణాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సిర్సాలోని డేరా సచ్చా సౌదా ఆశ్రమంలోకి ఇప్పటికే లక్షలాది భక్తులు చేరుకున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు తీర్పు వచ్చే అవకాశముంది.

బాబా 2002లో ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.