Home > క్రికెట్ > బాబర్ ఆజామ్ పాక్ ప్రధాని అవుతాడు

బాబర్ ఆజామ్ పాక్ ప్రధాని అవుతాడు

టీ 20 వరల్డ్ కప్ కథ చివరి దశకు చేరుకుంది. టోర్నీలో ఇంకో మ్యాచ్ మాత్రమే మిగిలింది. ఆదివారం ఇంగ్లాండ్, పాకిస్థాన్ మధ్య తుదిపోరు జరగనుంది. మెల్‌బోర్న్‌వేదికగా రెండు జట్లు తలపడనున్నాయి. ఏ మాత్రం ఆశల్లేని స్థితి నుంచి సంచలన ఆటతో పాకిస్థాన్ ఫైనల్ చేరగా.. మరోవైపు భారత్‌ను చిత్తు చేసి ఇంగ్లాండ్ దూసుకొచ్చింది. ఫైనల్‌కు ముందు పాత రికార్డులు, సెంటిమెంట్‌లను క్రికెట్ ప్రేమికులు గుర్తు చేసుకుంటున్నారు. 1992 వన్డే ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఇదే వేదికపై తలపడగా.. పాక్ విజేతగా నిలిచింది. మళ్లీ అదే ఫలితాన్ని రిపీట్ చేయాలని ఆ జట్టు భావిస్తుండగా.. లెక్క సరిచేయాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. తాజాగా, పాక్ కెప్టెన్‌ను ఉద్దేశించి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్లో పాకిస్థాన్ విజయం సాధిస్తే ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజామ్ పాకిస్థాన్ ప్రధాని అవుతాడని సునీల్ గవాస్కర్ అన్నారు. పాక్ 1992 సెంటిమెంట్‌‌ను గుర్తుచేస్తూ గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 1992 ప్రపంచకప్‌లో పాక్ జట్టును ఇమ్రాన్ ఖాన్ టైటిల్ వైపు నడిపించగా.. ఆయన 2018లో పాకిస్థాన్ ప్రధాని అయ్యారు. దాంతో పాక్ టైటిల్ గెలిస్తే బాబర్ 2048లో ప్రధాని అవుతాడని చమత్కరించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated : 12 Nov 2022 6:28 AM GMT
Tags:    
Next Story
Share it
Top