పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. స్వదేశంలో ఇంగ్లండ్‌పై మూడు టెస్టులు ఓడిన పాక్…కివీస్‌పై పేలవ ప్రదర్శన కొనసాగిస్తుంది. మొదటి టెస్ట్‌లో ఓటమి అంచులదాకా పోయి చివరికి డ్రాతో గట్టెక్కింది. మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మీడియాతో మాట్లాడారు. మ్యాచ్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించారు. అనంతరం ప్రెస్ మీట్ ముగించి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో ఓ జర్నలిస్ట్ బాబర్‌ను ఉద్దేశించి గట్టిగా అరిచాడు. మేము ప్రశ్నలు అడగడానికి ప్రయత్నిస్తుంటే మీరెందుకు వెళిపోతున్నారు. మీ మేనేజర్ మైక్ ఆఫ్ చేశాడంటూ వ్యాఖ్యలు చేశాడు. అది విన్న బాబర్ జర్నలిస్ట్ వైపు కోపంగా చూశాడు. ఎందుకు అరుస్తున్నావ్ అనేలా ఓ లుక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
babar made sure shoaib jutt realizes he's heard and ignored. pic.twitter.com/uR9SU2M8Zh
— کشف (@kashafudduja_) December 30, 2022
ఇక కరాచీ టెస్ట్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టును పాకిస్థాన్ డ్రాగా ముగించింది. చివరి రోజు చివరి సెషన్లో న్యూజిలాండ్ విజయానికి 138 పరుగులు అవసరం కాగా.. దూకుడుగా ఆడిన కివీస్ 7.3 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టపోయి 61 పరుగులు చేసింది. కానీ వెలుతురు తగ్గిపోవడంతో చివరి గంటలో ఓవర్లు మిగిలి ఉండగానే అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేశారు. దీంతో పాకిస్థాన్ డ్రాతో గట్టెక్కింది. ఈ ఏడాది సొంత గడ్డ మీద ఒక్క టెస్టులోనూ గెలవలేకపోయింది.