బాబా రాందేవ్ రియాలిటీ షో ! - MicTv.in - Telugu News
mictv telugu

బాబా రాందేవ్ రియాలిటీ షో !

August 26, 2017

బాబా రాందేవ్ ఏది చేసినా అది సంచలనమే. తాజాగా ఆయనొక రియాలిటీ షోను రూపొందించే పనిలో చాలా బిజీగా వున్నారు. ‘ఓం శాంతి ఓం ’ అనే పేరుతో ఆగస్ట్ 28 నుంచి ‘ స్టార్ భారత్ ’ ఛానల్లో ఇది ప్రసారం కానుంది. సోమవారం నుంచయి శుక్రవారం వరకు సాయంత్రం 6:00 గంటలకు ప్రసారం అవనుంది.

ఈ కార్యక్రమం తొలి ఎపిసోడ్ కు బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ హోస్ట్ గా వ్యవహరిస్తారు. తర్వాత కంటిన్యువస్  హోస్టుగా అపార్ శక్తి ఖురానా కొనసాగిస్తాడు. హీరోయిన్ సోనాక్షి సిన్హా, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ రావ్ జైనీ, సింగర్ కనికా కపూర్ లు జడ్జీలుగా వ్యవహరిస్తారు.  ఈ షో ప్రధానంగా దేవుళ్ల భజనలు, వచనాల గురించి సాగుతుందట. యువతలో భజనల గురించి భక్తి భావం పెంచే దిశలో ఈ కార్యక్రమం రూపొందుతోంది.  ఎపిసోడ్ కు 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటారు. ఇక రాందేవ్ బాబా స్పెషల్ అప్పీరియన్సుగా ఈ కార్యక్రమంలో కనిపిస్తాడట. పతంజలి వస్తువులతో సంచలనం సృష్ఠించిన బాబా రాందేవ్ బట్టల వ్యాపారంలోకి దిగుతూనే తాజాగా ఈ ఓం శాంతి ఓం రియాలిటీ షోతో మన ముందుకు రానున్నాడు. చూడాలి మరి ఈ ప్రోగ్రాం బాబా రాందేవ్ బ్రాండును ఏం రేంజులో పెంచనుందో.