రంగంలోకి డేరా ఆత్మాహుతి దళాలు! - MicTv.in - Telugu News
mictv telugu

రంగంలోకి డేరా ఆత్మాహుతి దళాలు!

August 31, 2017

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీం రేప్ కేసులో జైల్లో ఊచలు లెక్కపెడుతుండటాన్ని అతని అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే అల్లరకు పాల్పడిని భారీ విధ్వంసం, ప్రాణనష్టం కలగించిన అనుచరులు ఏకంగా ఆత్మాహుతి దాడులకు కూడా పాల్పడే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీనికి సంబంధించి వారికి బలమైన ఆధారాలు దొరికాయి.

బాబాకు ఏదైనా జరిగితే ఊరుకోబోమని, ప్రాణత్యాగానికి కూడా సిద్ధం అవుతామని అనుచరులు రాసుకున్న లేఖలు బయటకొస్తున్నాయి. కొందరైతే వీటిపై స్టాంపులు వేసి రిజిస్టర్ కూడా చేశారు.

‘డేరా బాబా మానవసేవను చూసి నా జీవితాన్ని ఆ లక్ష్యంలో సమర్పించాలని నిర్ణయించాను. నేనే ఏ ప్రమాదంలోనైనా, లేకపోతే మరో విధంగానైనా చనిపోతే అందుకు ఎవరూ బాధ్యులు కారు. దానికి నేనే బాధ్యురాలి. డేరా బాబా కానీ, నా కుటుంబ సభ్యులు కానీ బాధ్యులు కారు’ అని ఓ యువతి 2005లోనే డాక్యుమెంటు రాసింది. బాబాపై రేప్ కేసులో దర్యాప్తు ప్రారంభయ్యాక ఇలాంటివి కొల్లలుగా నమోదయ్యాయి. బాబాపై సీబీఐ అక్రమంగా కేసు బనాయిస్తున్నారని మరో అనుచరుడు వాపోయాడు. తాను దీనికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తానని, తనంకేం జరిగినా సీబీఐనే కారణమని హెచ్చరించాడు.

బాబా అరెస్ట్ నేపథ్యంలో ఇన్నాళ్లుగా నిద్రాణంగా ఉన్న ఈ ఆత్మాహుతి దళాలు తిరిగి క్రియాశీలం అవుతున్నట్లు తనకు నిఘా సమాచారం అందిందని బెంగాల్ పోలీసు ఉన్నతాధికారి ఏకే రావు చెప్పారు.