హనీ రావాలట, భార్య రావొద్దట! - MicTv.in - Telugu News
mictv telugu

హనీ రావాలట, భార్య రావొద్దట!

September 5, 2017

రే

ప్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్షపడి ఊచలు లెక్కిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీం బాబా తన భార్యను చూడ్డానికి ఇష్టపడడం లేదు. తప్పు చేశానన్న అపరాధ భావనో లేకపోతే మరో కారణమో తెలియదుగాని భార్యను జైలుకు రావద్దని చెప్పాడట. అయితే తన ప్రియురాలు హనీప్రీత్ ఇన్సాన్ ను మాత్రం క్రమం తప్పకుండా జైలుకు రమ్మన్నాడు ఈ రాసలీల బాబా. ప్రస్తుతం రోహ్తక్ లోని సునారియాలో జైల్లో ఉంటున్నాడు బాబా. తనను చూడ్డానికి ఎవరెవరు రావాలో అతగాడు ఓ జాబితాను పోలీసులకు ఇచ్చాడు. అందులో తన తల్లి, కొడుకు, కోడలు, ఇద్దరు కూతుళ్లు, వాళ్ల మొగుళ్ల పేర్లు సహా మొత్తం 10 పేర్లు ఉన్నాయి. భార్య హర్జీన్ కౌర్ పేరు మాత్రం గల్లంతైంది. కోర్టు జైలు శిక్ష వేసినప్పుడు.. జైల్లో తనతోపాటు హనీని తనకు తోడుగా ఉండేందుకు అనుమతించాలని బాబా సిగ్గులేకుండా కోరాడు. అయితే కోర్టు అందుకు అనుమతించలేదు.

బాబా ఆస్తులకు హనీప్రీతే వారసురాలు కాబోతోందని వార్తలు రావడం తెలిసిందే. నిజానికి ఆమెను బాబా.. కూతురిగా దత్తత తీసుకున్నా, ఆమెతో శారీరక సంబంధాలు నెరిపారనే ఆరోపణలు ఉన్నాయి. బాబాకు కోర్టు శిక్ష విధించాక అతణ్ని పోలీసు కస్టడీ నుంచి తప్పించడానికి హనీ పథకం వేసింది. పోలీసులు గాలిస్తుండటంతో పరారైంది. ప్రస్తుతం నేపాల్లో ఉన్నట్లు భావిస్తున్నారు.