సింహాన్ని పెంచుకుంటున్న కొండముచ్చు - MicTv.in - Telugu News
mictv telugu

సింహాన్ని పెంచుకుంటున్న కొండముచ్చు

February 5, 2020

lion....

సింహాన్ని చూస్తే చిన్న చిన్న జంతువులు భయంతో పరుగులు పెడతాయి. కానీ అలాంటి సింహం కూనను ఓ కొండముచ్చు ఎంతో అపురూపంగా పెంచుకుంటోంది. తన పిల్లలతో పాటు సాకుతూ దానికి సపర్యలు చేస్తోంది. చెట్లపైకి ఎక్కడం, కొండ అంచుల్లోకి వెళ్లి కూర్చోవడం కూడా నేర్పిస్తోంది. దక్షిణాఫ్రికాలోని కృంగెర్ నేషనల్ పార్కులో వింత చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు చూసిన వారు వీటి మధ్య ఉందన్న సంబంధం చూసి ఆశ్చర్యపోతున్నారు. 

ఈ రెండు అటవీ జంతువులు ఎంతో ఆప్యాయంగా గడుపుతున్నాయి. ఆ చిన్న సింహం కూనను కొండముచ్చు తనతో పాటు ఎత్తుకొని వెళ్లిపోతుంది. చెట్టు మీద కుర్చుని దానితో సరదాగా ఆటలు కూడా ఆడుకుంటోంది. వీటి అనుబంధంపై జూ పార్కులో సఫారీ నిర్వహించే కుర్త్ షట్లజ్ తాను గత 20 ఏళ్లలో ఏనాడు ఇటువంటి దృశ్యాన్ని చూడలేదంటున్నారు. ఈ రెండింటికి మధ్య స్నేహం కుదరడం విచిత్ర సందర్భంగా అభివర్ణించారు. 

r