బాబ్రీ కేసు కీలక అంశాలు.. విచారణ సాగింది ఇలా - MicTv.in - Telugu News
mictv telugu

బాబ్రీ కేసు కీలక అంశాలు.. విచారణ సాగింది ఇలా

September 30, 2020

Babri Masjid Case Update  .

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. ఆ నాటి సంఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు అంతా నిర్ధోషులేనని ప్రకటించింది. దీంతో 28 ఏళ్ల తర్వాత ఈ కేసులో ఊరట కలిగింది.  ఆస్తుల ధ్వంసం చేయడం, దోపిడీ, మత విధ్వేషాలు రెచ్చగొట్టడం లాంటి అభియోగాలు మోపారు. కూల్చివేత వెనక కుట్ర కోణం దాగి ఉందని సీబీఐ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. క్షణికావేశంలో జరిగిన ఘటనగానే పరిగణించారు. దాదాపు 2వేల పేజీలతో తీర్పు కాపీని న్యాయమూర్తి సురేంద్ర యాదవ్ వెల్లడించారు.   

విచారణ సాగింది ఇలా : 

1992 డిసెంబర్ 6 వ తేదీన మసీదును కూల్చివేశారు. ఆ తర్వాత దేశంలో ఇది సంచలనంగా మారింది. 1993లో ఈ కేసును తొలిసారి సీబీఐకి అప్పటి ప్రభుత్వం అప్పగించింది. ముందుగా 49 మందిపై అభియోగాలు వచ్చాయి.  దాదాపు ఈ కేసు 28 ఏళ్లపాటు సుదీర్ఘంగా విచారణ మొత్తం వెయ్యి మందికి పైగా సాక్షులను విచారించారు.  2001లో సీబీఐ న్యాయస్థానం ఈ కేసులో అద్వానీతో సహా కొంతమంది ప్రముఖుల పేర్లను తొలగిస్తూ తీర్పును ఇచ్చారు.  2010 లో అలహాబాద్ హైకోర్టు సైతం దీన్ని సమర్ధించింది.  కానీ, 2017లో సుప్రీకోర్టు  దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారిపేర్లను కూడా చేర్చారు. విచారణ సమయంలో 17 మంది చనిపోయారు. 32 మంది పై విచారణ జరిపిన న్యాయస్థానం కేసును కొట్టివేసింది. రెండేళ్లలో కేసు విచారణ పూర్తి చేసి తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ప్రధానంగా ఎల్.కే అద్వానీ, కల్యాణ్ సింగ్, మురళి మనోహర్ జోషి, ఉమా భారతీ, నృత్యగోపాల్ దాస్ సహా పలువురు ప్రముఖులు ఉన్నారు.