బాబ్రీ మసీదు దానికదే కూలిపోయిందా?: ఒవైసీ  - MicTv.in - Telugu News
mictv telugu

 బాబ్రీ మసీదు దానికదే కూలిపోయిందా?: ఒవైసీ 

September 30, 2020

Babri masjid demolition court verdict asaduddin owaisi slams

1992 నాటి బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నిందితులందరూ నిర్దోషులేనంటూ ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఈ రోజు చరిత్రలో బ్లాక్ డే. అందరూ నిర్దోషులైతే మరి మసీదును ఎవరు కూల్చేశారు? దానంతట అదే కూలిపోయిందా?’ అని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. 

తమకు న్యాయం జరగలేదని, కోర్టు తీర్పు తనకెంతో బాధ కలిగించిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘మసీదును ధ్వంసం చేశారనేందుకు ఆధారాలు లేవంటున్నారు. కానీ దాన్ని ఎవరు కూల్చారో ప్రపంచమంతా చూసింది. మసీదును కూల్చండి అని ఉమాభారతి రెచ్చగొట్టడం నిజం కాదా. కోర్టు తీర్పు  ముస్లింలను, ముస్లిం పర్సనల్‌ లా బోర్డును నిరుత్సాహానికి గురి చేసింది’ అని ఒవైసీ అన్నారు. అసలేం జరిగిందో తమకు అర్థం కావడం లేదని, నిజాలు వెల్లడించి తనకు జ్ఞానోదయం చేయాలని ఎద్దేవా చేశారు.