అఖండ, భీమ్లా నాయక్‌లపై బాబు గోనినేని సటైర్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

అఖండ, భీమ్లా నాయక్‌లపై బాబు గోనినేని సటైర్లు..

February 25, 2022

బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా తెలియని వారికి కూడా తెలిసిపోయిన మేధావి బాబు గోగినేని. దేవుడు లేడంటూ, మతాలను, పీఠాలను, బాబాలను, మూఢనమ్మకాలను చీల్చి చెండాడే ఆయన కొన్నాళ్లుగా కొత్త దాడి కూడా ప్రారంభించారు. సినిమాలపైనా కన్నేసి విమర్శలు సంధిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన సినిమాలపై చేస్తున్న వ్యాఖ్యలు సినీ ప్రేక్షకుల్లో, అభిమనుల్లో ఆసక్తి రేపుతున్నాయి. ప్రశంసలు, విమర్శలు కూడా వస్తున్నాయి.

తాజాగా ఆయన అఖండ, భీమ్లా నాయక్ సినిమాలపై కామెంట్ చేశారు. ‘ఈ సినిమాల్లో హీరోలు వేసుకున్న తెల్లటి లుంగీలు ఏ బ్రాండ్? ఫైటింగ్‌లో కూడా అస్సలు నలగవు. ఏ మాత్రం దుమ్ము అంటుకోదు. వెరీ నైస్ ప్రోడక్ట్’ అని అన్నారు. దీనిపై కొందరు అభిమానులు..‘సార్ మీరు కూడా మూవీలు చూస్తారా?’ అని ప్రశ్నిస్తున్నారు. కాగా పవన్ కల్యాణ్‌కు తాను మద్దతిస్తున్నట్టు సాగుతున్న ప్రచారంపై గోగినేని స్పందించారు. అదంతా అబద్ధమని తోసిపుచ్చారు.