Babu Gogineni Sensational Comments On Munugode Election Result
mictv telugu

ముక్క మెక్కి, చుక్క తాగి.. బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు..

November 7, 2022

Babu Gogineni Sensational Comments On Munugode Election Result

మునుగోడు ఎన్నికల్లో అన్ని పార్టీలకు మిశ్రమ ఫలితాలు ఇచ్చిన ప్రజా తీర్పు అద్భుతమని విశ్లేషకులు అంటున్నారు. అసలు ఉనికే లేని కాంగ్రెస్ కి మునుగోడు డబ్బుల యుద్ధంలో 20వేలకు పైగా ఓట్లు వచ్చినందుకు సంతోషించాలో.. డిపాజిట్ దక్కలేదని బాధ పడాలో తెలియని పరిస్థితి. ఇక కోరి తెచ్చుకున్న ఎన్నికల్లో ఓడించారని మథనపడాలో.. 12వేల ఓటు బ్యాంక్ ఉన్న తమకి 90వేల ఓట్లు పడినందుకు ఎగిరి గంతేయాలో తేల్చుకోలేని విచిత్ర పరిస్థితి బీజేపీది.

ఇక గెలిచామని సంబరాలు చేసుకోవాలో.. భారీ మెజారిటీ మిస్ అయ్యిందని ఫీల్ అవ్వాలో అన్న అయోమయం టీఆర్ఎస్‌కి ఇచ్చింది మునుగోడు ప్రజానీకం. ఈ నేపథ్యంలో విశ్లేషకులు అంతా ప్రజా తీర్పుని పొగుడుతున్నారు. విచక్షణతో అన్ని పార్టీలను ఆదరిస్తూనే, మొట్టికాయలు సైతం వేసిన ప్రజా తీర్పు చారిత్రాత్మకమని అందరు అంటుంటే.. మానవత వాది బాబుగోగినేని మాత్రం డిఫరెంట్‌గా స్పందించాడు. తనదైన శైలిలో ప్రజలు ప్రలోభాలకు లొంగిన తీరుని ఎండకట్టారు. అందరిని ఆలోచింప చేస్తున్న బాబు గోగినేని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మునుగోడు ఎన్నికల ఫలితాలపై బాబు గోగినేని స్పందిస్తూ. “రాజకీయం నీచంగా మారిపోయింది! హై కమాండ్ 5 వేలు ఇవ్వమంటే 4 వేలు మాత్రమే ఇచ్చి వెయ్యి నొక్కేసారంట లీడర్లు. గో మూత్రం పోయమంటే నైంటీ ఎంఎల్ సోమరసం పోసారట. ప్రజలూ తక్కువ తినలేదు/తాగలేదు: ముక్క మెక్కి, చుక్క తాగి, అనైతికంగా, నిబద్ధత లేకుండా, పలు నోటుకు-ఓటు స్కీమ్లలో జేరి, చివరికి వారికి ఇష్టం వచ్చినట్లు ఓటు వేశారట. ఎవడినీ నమ్మడానికి లేదు ఈ రోజుల్లో. మంచి పనులు సరే! కానీ, దొంగ పనుల్లో కూడా నిజాయితీ లోపించడం జరిగితే సమాజం ఎలా నడుస్తుంది? ఎక్కడికి పోతున్నాం మనం? Thieves Honor అని ఒకటి ఉంటుంది అని అందరికీ గుర్తు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. జై పార్టీ స్వామ్యం” అంటూ డబ్బురాజకీయాలపై బాబుగోగినేని ఆవేదన వ్యక్తం చేశాడు.