కేంద్ర మంత్రిని జుట్టు పట్టుకుని కొట్టిన లెఫ్ట్ విద్యార్థులు  - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్ర మంత్రిని జుట్టు పట్టుకుని కొట్టిన లెఫ్ట్ విద్యార్థులు 

September 19, 2019

Babul Supriyo....

విద్యార్థుల చేతిలో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన జుట్టు పట్టుకుని, చొక్కా చించేసి కొట్టారు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం పశ్చిమ  బెంగాల్‌లోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో. ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ విద్యార్ధి విభాగం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్ధి సంఘాల నేతలు చుట్టుముట్టి  ‘గో బ్యాక్’ నినాదాలు చేశారు. సుప్రియోను వర్సిటీ ప్రాంగణంలోకి అనుమతించమని నినాదాలతో హోరెత్తించారు. 

ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి సెక్యూరిటీ సిబ్బంది తుపాకులు సైతం కిందపడిపోయాయి. చివరికి పటిష్ట బందోబస్తు మధ్య బాబుల్ సుప్రియోను ఆడిటోరియంలోకి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడారు. తాను రాజకీయాలు చేయడానికి ఇక్కడికి రాలేదని.. విద్యార్ధుల  ప్రవర్తన తనను తీవ్రంగా బాధించిందని అన్నారు. నిరసనకారులు విద్యార్ధులను రెచ్చగొట్టి తొక్కిసలాట నిర్వహించారని సుప్రియో ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశం ముగిశాక ఆయన తిరిగి బయటకు వెళ్లే సమయంలోనూ విద్యార్థులు మళ్లీ నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో ఆయన జట్టు పట్టుకుని, చొక్కా చించివేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి  గవర్నర్‌కు నివేదిక అందిస్తామని వర్సిటీ వైస్ ఛాన్సలర్ తెలిపారు.