Babulal Marandi reacts on Love Jihad in Jharkhand
mictv telugu

సంతాల్ తెగ మైనర్ బాలికపై అత్యాచారం.. లవ్ జిహాదే కారణం?

September 3, 2022

Babulal Marandi reacts on Love Jihad in Jharkhand

జార్ఖండ్‌లో ఓ గిరిజన మైనర్ బాలిక అత్యాచారానికి బలైంది. 14 ఏళ్ల బాలికపై అర్మాన్ అన్సారీ అనే వ్యక్తి అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. అంతేకాక, చెట్టుకు తాడుతో వేలాడదీసి ఉరేసుకొని చనిపోయినట్టు నమ్మించే ప్రయత్నం చేశాడు. దీనిపై జార్ఖండ్ తొలి బీజేపీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత బాబూలాల్ మరాండీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఇది కచ్చితంగా లవ్ జిహాదేనని, ఇంకెంత కాలం గిరిజన అమ్మాయిలు బలవ్వాలని ప్రశ్నించారు. తన ట్వీట్‌ను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ట్యాగ్ చేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, ఈ ఘటనకు అంతర్జాతీయ లవ్ జిహాద్ ముఠాతో సంబంధం ఉందనే అనుమానాన్ని మరాండీ వ్యక్తం చేశారు. ఇటీవలే రాష్ట్రంలో అంకిత అనే అమ్మాయిని పెట్రోల్ పోసి తగులబెట్టేశాడని, ఇప్పుడు మరో ఘాతుకం అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. సీఎం హేమంత్ సోరేన్‌ మాత్రం శాంతిభద్రతలు పట్టించుకోకుండా తన సొంత కంపెనీకి మైనింగ్ కాంట్రాక్టులు కట్టబెట్టే పనుల్లో ఉన్నారని దుయ్యబట్టారు. క్యాంపు రాజకీయాలు చేసే సీఎం పాలనలో దళితులు, గిరిజనులు సురక్షితంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సంతాల్ తెగకే చెందిన ద్రౌపది ముర్ము ఇటీవల భారత రాష్ట్రపతిగా ఎన్నికైన విషయం తెలిసిందే. అటు సీఎం హేమంత్ సోరేన్ తన 40 మంది ఎమ్మెల్యేలతో పక్క రాష్ట్రమైన కాంగ్రెస్ పాలిత చత్తీస్ గఢ్‌లో ఉన్నారు.