Baby Born With "Permanent Smile" Due To Rare Condition
mictv telugu

నవ్వు ముఖమే ఆ పసిపాప లోపం.. ప్రపంచంలోనే అరుదైన కేసు

May 27, 2022

Baby Born With "Permanent Smile" Due To Rare Condition

తల్లి గర్భం నుంచి బయటకు వచ్చే సమయంలో ప్రతి శిశువు ఏడవడం, ఆ ఏడుపు విని తల్లిదండ్రులు సంతోషపడటం సాధారణం. కానీ ఆస్ట్రేలియాకు చెందిన ఓ పసిపాప పుట్టిన సమయంలో ఏడవలేదు సరికాదు.. నవ్వుతూనే పుట్టిందట. కారణం ఆ బిడ్డ ముఖంలో ఓ లోపం. ఆ పాప పెదాల దగ్గర అసాధారణ స్థితి నెలకొనడంతో ఆ తల్లిదండ్రులు కంగారుపడిపోయారు.డాక్టర్లు పరిశీలించి.. అది బైలెటరల్‌ మాక్రోస్టోమియాగా నిర్ధారించారు. దీని వల్ల పెదాలు సాగిపోయినట్లు కనిపిస్తుంది.

ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్టియానా వెర్చెర్(21), బ్లేజియా ముచా(20) సంతానం ఈ ఎయిలా. డిసెంబర్‌ 2021లో జన్మించింది ఈ చిన్నారి. ఆ సమయంలో ఏడవకపోవడంతో పాప పరిస్థితి గురించి డాక్టర్లను ఆరాతీయగా.. తల్లి గర్భంలోనే బిడ్డకు ఏడో వారంలో పిండ దశ నుంచే కణజాలాల వల్ల ఈ స్థితి ఏర్పడుతుందని చెప్పారు. ప్రపంచంలో ఇలాంటి కేసులు ఇప్పటిదాకా 14 మాత్రమే ఉన్నాయని తేలింది. సర్జరీతో బిడ్డ స్థితి మెరుగుపడే అవకాశం ఉన్నా.. పెద్దయ్యాక మళ్లీ ఆ స్థితి ఏర్పడొచ్చనే డాక్టర్లు చెబుతున్నారు. ఆ పసికందు తల్లి మాత్రం మనిషికి ఏడుపు ఒక శాపం.. నా బిడ్డకు నవ్వు ఒక వరం.. అని చెబుతోంది.