పిల్లలూ జాగ్రత్త.. ఐస్ క్రీంలో బల్లి.. - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లలూ జాగ్రత్త.. ఐస్ క్రీంలో బల్లి..

March 15, 2019

పిల్లలకు చల్లని ఐస్ క్రీంలు అంటే చాలా ఇష్టం. అసలే ఇప్పుడు వేసవికాలం అవడంతో పిల్లలు ఇంకా ఎక్కువ ఐస్ క్రీంలు తినాలని చూస్తుంటారు. అయితే ఈ ఐస్ క్రీంల విషయంలో పెద్దలు తస్మాత్ జాగ్రత్తగా వుండాలి. ఎందుకంటే ఓచోట ఐస్ క్రీంలో బల్లి వచ్చింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు ఓ తోపుడు బండి వద్ద ఐస్ క్రీం కొన్నాడు. అనంతరం దాన్ని తింటుండగా నోటికి ఏదో తగిలినట్లు అనిపించింది. ఏంటా.. అని చూసేసరికి ఐస్‌లో చచ్చిన బల్లి కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ వెంటనే వాంతులు చేసుకున్నాడు. స్థానికులు అతణ్ని ఆసుపత్రిలో చేరాడు.

Baby care .. lizard in ice cream ..

ఈ విషయం గ్రామంలో తెలియడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఈ ఐస్ తయారీదారులపై కేసు నమోదుచేయాలని బాధితుడు శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వేసవి తాపానికి తాళలేక చాలామంది శీతల పానీయాలు తాగితే, మరికొంతమంది ఐస్ క్రీంలను ఆశ్రయిస్తుంటారు. అయితే చాలా సందర్భాల్లో ఐస్, ఐస్ క్రీమ్‌ల తయారీదారులు నాణ్యత పాటించకుండానే వాటిని వినియోగదారులకు అంటగడుతూ ఉంటారు. కాస్త జాగ్రత్తగా వుండాలని అంటున్నారు. ముఖ్యంగా పిల్లల విషయంలో తస్మాత్ జాగ్రత్త అంటున్నారు స్థానికులు.