రాత్రి శ్మశానం నుంచి ఏడుపు.. అక్కున్న చేర్చుకున్న అమ్మకాని అమ్మ - MicTv.in - Telugu News
mictv telugu

రాత్రి శ్మశానం నుంచి ఏడుపు.. అక్కున్న చేర్చుకున్న అమ్మకాని అమ్మ

August 10, 2020

Baby crying from funeral ground.

పగలే శ్మశానం వైపు పోవడానికి ఎవరైనా భయపడతారు. అలాంటిది రాత్రి పూట శ్మశానంలో ఏదైనా శబ్దం వస్తున్నప్పుడు వెళ్లాలంటే జంకుతారు. కానీ, ఓ మహిళ ధైర్యం చేసి ఓ పసి పాప ప్రాణాలు పోకుండా కాపాడింది. ఈ సంఘటన జార్ఖండ్ లోని లోహర్ దగా జిల్లాలో జరిగింది. శనివారం రాత్రి కుడు పోలీసు స్టేషన్ ప్రాంతంలోని చంద్లాసో గ్రామంలో రాత్రి 7.30 గంటలకు శ్మశాన వాటికలో సగం పూడ్చివేసి ఉన్న సమాధి నుంచి ఓ శిశువు ఏడుస్తుంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ మహిళకు ఆ ఏడుపు వినిపించింది. తొలుత ఆమె దెయ్యం అనుకుని అటువైపు వెళ్ళడానికి భయపడింది. 

కానీ, కొంచెం సమయం అక్కడే ఉండి చూసింది. అయినా కూడా ఆ ఏడుపు వినిపిస్తూనే ఉంది. దీంతో వెంటనే ఊరి ప్రజలకు సమాచారం ఇచ్చింది. వారు అక్కడికి వచ్చే లోపు మట్టిలో కప్పెట్టిన ఆ బిడ్డను బయటికి తీసింది. ఆ బిడ్డకు బొడ్డు తాడు కూడా తీయకుండా అలాగే ఉంది. దీంతో గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని శిశువును స్వాధీనం చేసుకున్నారు. చికిత్స నిమిత్తం రాంచీలోని రాణి చిల్డ్రన్స్ హాస్పిటల్ కు తరలించారు. ఆ బిడ్డ ఎవరు? తల్లిదండ్రులు ఎవరు? బతికి ఉండగానే పాతిపెట్టారా? లేదా చనిపోయిందనుకుని పాతి పెట్టారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.