Home > Featured > మూడేళ్ల పాప పాల కోసం బార్‌కు వెళ్లింది.. తర్వాత.. 

మూడేళ్ల పాప పాల కోసం బార్‌కు వెళ్లింది.. తర్వాత.. 

పిల్లలకు అన్యంపుణ్యం తెలియదు. స్వచ్ఛమైన హృదయాలతో దేవుడి ప్రతిరూపాల్లా ఉంటారు. మూడేళ్ల మిలా కూడా అంతే. ఆ రోజు సెలవు కావడంతో తల్లిదండ్రులతో కలసి విహారానికి వచ్చింది. పెద్దలు స్విమ్మింగ్ పూల్లో సరదాగా గడిపేస్తున్నారు. మిలా కూడా చాలాసేపు నీళ్లతో ఆడుకుంది. కానీ మధ్యలో బాగా ఆకలైంది. తల్లిదండ్రులేమో ఈతలో బిజీగా ఉన్నారు. ఎవరూ తనను పట్టించుకోవడం లేదు.

మిలా మెల్లగా పూల్ దగ్గర్నుంచి లేచి పక్కనే ఉన్న బార్ లోకి వెళ్లింది. పెద్దలు పెద్దపెద్ద గ్లాసుల్లో ఏదేదో తాగుతున్నారు కదా, తనకూ తాగడానికి పాలు దొరుకుతాయని అనుకుంది. వెయిటర్ పిలిచి తనకు పెద్ద గ్లాసెడు పాలు కావాలని దర్జాగా చెప్పింది. సదరు వెయిటర్ నోరెళ్లబెట్టారు. తమ వద్ద పాలు దొరకవని, పెద్దలు తాగే మందు ఉంటుందని చెప్పారు. కానీ మిలా పట్టించుకోలేదు. తనకు పాలు ఇవ్వాలంది. దీంతో ఇక తప్పదన్నట్టు వేరే చోటునుంచి పెద్ద గ్లాసెడు పాలు పట్టుకొచ్చి ఆ పిల్ల చేతిలో పెట్టారు. దూరం నుంచి దీన్ని గమనిస్తున్న మిలా తండ్రి వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టాడు. దీన్ని చూసిన జనం మిలా ధైర్యానికి, నిష్కల్మష మనసుకు జేకొడుతున్నారు. క్రొయోషియాలోని దుబ్రోవ్నిక్ ప్రాంతంలో జరిగిందీ సంఘటన.

Updated : 4 Sep 2019 9:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top