ఆ బుడ్డోకి అరుదైన గౌరవం.. కేజ్రీవాల్ ప్రమాణానికి వచ్చేస్తున్నాడు..  - MicTv.in - Telugu News
mictv telugu

ఆ బుడ్డోకి అరుదైన గౌరవం.. కేజ్రీవాల్ ప్రమాణానికి వచ్చేస్తున్నాడు.. 

February 13, 2020

arvind kejriwal

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి విజయ దుందుభి మోగించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈ నెల 16 మూడోసారి సీఎంగా పగ్గాలు చేపట్టున్న సంగతి తెలిసిందే. రామ్‌లీలా మైదానంలో జరిగే ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ఈసారి ఓ బుల్లి అతిథి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మంగళవారం రోజున విజయయోత్సవాల్లో కనిపించిన ఆ చిన్నోడి ఫోటో మీడియాలో తెగ సందడి చేయడంతో అతనికి ఈ ప్రత్యేక గౌరవం దక్కింది. 

అచ్చం కేజ్రీవాల్‌ మాదిరిగా టోపీ, మఫ్లర్, కళ్లద్దాలు బుడ్డమీసాలతో హల్‌చల్ చేసిన ఆ బోడ్డోడిని ఏడాది వయసున్న అవ్యాన్ తోమర్‌గా గుర్తించారు. అతని వివరాలు కనిపెట్టిన ఆప్ నేతలు ‘సిద్ధంగా ఉండు జూనియర్‌!’ అంటూ ట్విటర్లో ప్రమాణానికి ఆహ్వానం పలికింది. అవ్యాన్‌ తల్లిదండ్రులు ఆప్ పార్టీకి వీరాభిమానులు. తండ్రి రాహుల్ ఢిల్లీలోనే వ్యాపారం చేస్తున్నాడు.