Home > Featured > అమ్మా..లేఅమ్మా..శవాన్ని తట్టిలేపుతోన్న చిన్నారి

అమ్మా..లేఅమ్మా..శవాన్ని తట్టిలేపుతోన్న చిన్నారి

baby

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ వలస కూలీల పట్ల శాపంగా మారింది. లాక్ డౌన్ కారణంగా పరాయి రాష్ట్రాల్లో ఉంటున్న వలస కూలీలు ఉపాధిలేక అవస్థలు పడుతున్నారు. తినేందుకు తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంటితుడుపు చర్యగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్‌ రైళ్లలో సీటు ఎప్పుడు దొరుకుతుందా.. ఎప్పుడు సొంతూరికి చేరుకుంటామని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇంటికి వెళ్లేకంటే ముందే ఆకలితో.. ఎండ దెబ్బకు చచ్చిపోతున్నారు. ఇటీవల బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లో జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం.

ఓ వలసకూలీ(30) తన పిల్లాడు, కుటుంబంతో కలిసి ఆదివారం రోజున గుజరాత్ రాష్ట్రం నుంచి శ్రామిక్ స్పెషల్ రైల్ లో బీహార్ లోని ముజఫర్ నగర్ కి పయనమైనది. రైల్లో వస్తుండగా ఆహారం, తాగునీరు దొరక్క వడ గాలులకు తట్టుకోలేక వారి కుటుంబం అనారోగ్యపాలైంది. సొంతూరు ముజఫర్ నగర్ చేరుకోవడానికి కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో రైల్వే సిబ్బంది ఆమె శవాన్ని తీసి ఫ్లాట్ ఫార్మ్ పై వేశారు. అయితే తల్లి చనిపోయిన విషయం తెలియక ఆ పిల్లాడు ఆమె నిద్రబోతోంది అనుకుని లేపడానికి ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated : 27 May 2020 5:23 AM GMT
Tags:    
Next Story
Share it
Top