చోటా భీమ్.. 5.9కేజీల బరువుతో పుట్టాడు - MicTv.in - Telugu News
mictv telugu

చోటా భీమ్.. 5.9కేజీల బరువుతో పుట్టాడు

January 25, 2020

Baby weighing 5.9 kg born in darjeeling

అప్పుడే పుట్టిన శిశువు బరువు సాధారణంగా రెండు నుంచి మూడు కేజీల వరకు ఉంటుంది. కొందరు శిశువులు తక్కువ బరువుతో పుడతారు. కానీ, కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న వాణి విలాస్ ఆస్పత్రిలో ఈ నెల 18న ఓ బాలుడు మాత్రం 5.9 కేజీల బరువుతో జన్మించాడు. 

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్‌ జిల్లాకు చెందిన యోగేష్‌, సరస్వతి అనే దంపతులు 16 ఏళ్ల క్రితం బెంగళూరులోని యెలహంకకు వచ్చి స్థిరపడ్డారు. సరస్వతికి 9 నెలలు నిండడంతో ప్రసవం కోసం వాణి విలాస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సరస్వతి బరువు 80 కేజీలు ఉండేసరికి.. డాక్టర్లు కవలలు అయి ఉండొచ్చు అనుకున్నారు. కానీ, ప్రసవం జరిగిన తర్వాత ఒకే శిశువు ఉండడంతో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఆ శిశువు బరువు 5.9 కేజీలు ఉందని డాక్టర్లు తెలిపారు. ఇప్పటికే సరస్వతికి సంతానం ఒకరు ఉండగా.. మళ్లీ 14 ఏళ్ల తర్వాత రెండో సంతానం కలిగింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. హాస్పిటల్ సిబ్బంది ఆ శిశువుని చోటా భీమ్ అని పిలుస్తున్నారు.