భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ సందర్భంగా మార్చి 19న విశాఖ వేదికగా రెండో వన్డే జరగనుంది. మొదటి వన్డేలో విజయం సాధించిన భారత్ రెండో వన్డేలో కూడా గెలిచి సిరీస్ దక్కించుకోవాలని భావిస్తోంది. అయితే రెండో వన్డే జరగడంపై నీలినీడలు అలముకున్నాయి. విశాఖ వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. అల్పపీడనం కారణంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ సాయంత్రం కూడా విశాఖ నగరంలో జల్లు కురిసింది. రేపు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంతో విశాఖ వన్డే జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి.
మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరుజట్ల ఆటగాళ్లు సాగరనగరానికి చేరుకున్నారు. క్రికెటర్లకు విశాఖ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. అనంతరం రాడిసన్ బ్లూ హోటల్‌కు పయనమయ్యారు. క్రికెట్లర్లు రాకతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక బావమరిది పెళ్లి కారణంగా మొదటి వన్డేకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ రెండో వన్డేలో బరిలో దిగనున్నాడు.
మ్యాచ్‌కు వర్షం అడ్డంకి మారుతుందనే వార్తలతో ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. మ్యాచ్ కోసం ఇప్పటికే భారీగా టికెట్లు అమ్ముడయ్యాయి. అభిమానులు మ్యాచ్‌ను సిద్ధమైపోయారు. ఇలాంటి సమయంలో వర్షంతో ఆందోళన కలిగిస్తోంది. విశాఖలో దాదాపు మూడేళ్ల తర్వాత వన్డే మ్యాచ్ జరగబోతుంది.