తెలంగాణలో మద్యంప్రియులకు బ్యాడ్ న్యూస్. రాష్ట్రంలో మూడు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. ఈనెల 13న హైదరాబాద్ రంగారెడ్డి, పాలమూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలీంగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మూడు జిల్లాల్లో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.
ఈనెల 11 వ తేదీని సాయంత్రం 4 గంట నుంచి 13వ తేదీ సాయంత్రం 4గంటల వరకు వైన్స్ లు మూసివేయాలని నిర్ణయించారు. ఈ సమయంలో మద్యం అమ్మకూడదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదేశాలను జారీ చేసింది. జారీ చేసిన నిబంధనలను అతిక్రమించిన వైన్సులపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది ఎక్సైజ్ శాఖ.
అటూ ఏపీలోనూ మద్యం షాపులు మూత పడనున్నాయి. ఈనెల 13న ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మూడు జిల్లాల్లో మూడు రోజుల పాటు మద్యం షాపులు బంద్ కానున్నాయి.