నాగచైతన్య అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. - MicTv.in - Telugu News
mictv telugu

నాగచైతన్య అభిమానులకు బ్యాడ్‌న్యూస్..

June 25, 2022

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య హీరోగా, రాశీఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్న ‘థాంక్యూ’ సినిమాకు సంబంధించి చిత్రబృందం ఓ కీలక విషయాన్ని తెలియజేసింది. ‘థాంక్యూ’ సినిమాను జులై 8న రిలీజ్ చేస్తామని ఇదివరకే చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం రెండు వారాలపాటు వాయిదా పడిందని, జులై 22వ తేదీన సినిమాను విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.

నాగచైతన్య సమంతతో విడిపోయిన తర్వాత ‘బంగార్రాజు’ సినిమా మాత్రమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో నాగ చైతన్య అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. అయితే, నెక్స్ట్ వచ్చే సినిమాలో ప్రేక్షకులను మెప్పించేలా ఓ సరికొత్త కథతో ముందుకు రావాలని నాగచైతన్య.. ‘మనం’చిత్రంతో తమ కుటుంబానికి చిరకాలం గుర్తిండిపోయే విజయం అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో వారిద్దరి కాంబినేషన్ వస్తున్న తాజా సినిమా ‘థాంక్యూ’. ఈ సినిమాపై చైతూ చాలా ఆశలు పెట్టుకున్నాడు. వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నాడు. కానీ, కొన్ని కారణాల కారణంగా సినిమాను జులై 22వ తేదీన విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు ప్రకటించడంతో నాగచైతన్య అభిమానులు తీవ్ర నిరాశకు గురౌతున్నారు. చైతూను వెండితెరపై చూడాలని వేయ్యి ఆశలతో ఎదురుచూస్తున్న అభిమానులకు దిల్ రాజు షాక్ ఇవ్వడంతో ఇంకొన్ని రోజులు వేచి చూడాలా అంటూ మండిపడుతున్నారు.

ప్రస్తుతం థాంక్యూ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన టీజర్, రెండు పాటలు విడుదలైయ్యాయి. విడుదలైన రోజు నుంచి నేటీవరకు వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది.