సామాన్య ప్రజలకు రైల్వే శాఖ మళ్లీ షాక్ ఇచ్చింది. ఒకటి రెండు కాదు ఏకంగా 70 ఆహార పదార్థాల ధరలను పెంచారు. రైల్వే వైపు నుండి స్టేషన్‌లో లభించే ఫుడ్ స్టాక్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. అంటే రైల్వే స్టేషన్‌లో ఇంతకుముందు ధరకే ఆహారం అందుబాటులో ఉంటుంది. ప్రయాణంలో రైలులోని ప్యాంట్రీమెన్ నుండి ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది. రైలులో లభించే వివిధ వస్తువులపై రూ.2 నుంచి రూ.25 వరకు పెంచారు.
ఒక సమోస ప్రస్తుతం 8రూపాయలు ఉంటే దాన్ని 10 రూపాయలకు పెంచింది. శాండ్ విచ్ 15 రూపాయల నుంచి 25 రూపాయలకు పెరిగింది. బర్గర్ 40 నుంచి 50, డోక్లా 20 నుంచి 30, బ్రెడ్ పకోడా 10 నుంచి 15, ఆలూ బొండా 40 నుంచి 50, రోటీ రూ. 3 నుంచి రూ. 10లకు పెంచేసింది.