ఆంధ్రప్రదేశ్లో జూన్ 5వ తేదీ నుంచి బడిగంట మోగనుంది. ఇందుకు సంబంధించిన అకాడెమిక్ క్యాలెండర్ను ఇదివరకే విద్యాశాఖ అధికారులు జారీ చేశారు. జారీ చేసిన అకాడెమిక్ క్యాలెండర్ ప్రకారం.. ”జులై 5న స్కూల్స్ ప్రారంభమై, వచ్చే ఏడాది ఏప్రిల్ 29న ముగుస్తాయి. ఒకటోవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు సమ్మేటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 27తో ముగుస్తాయి. ప్రతి తరగతికి వారానికి 48 పీరియడ్లు ఉంటాయి. ప్రతి ఉపాధ్యాయుడు వారానికి 38 నుంచి 39 పీరియడ్లు బోధించాలి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు క్లాసులు ఉంటాయి. ఆ తర్వాత సాయంత్రం 3.30 గంటల నుంచి 4 గంటల వరకు ఆటలు లేదా రివిజన్ క్లాసులు ఉంటాయి. ప్రీహైస్కూల్, హైస్కూల్, హైస్కూల్ ప్లస్ పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి. ఆ తర్వాత 4 గంటల నుంచి 5 గంటల వరకు ఆటలు లేదా రివిజన్ క్లాసులు ఉంటాయి.”
మరోవైపు జులై 5 నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతున్నప్పటికీ ఉపాధ్యాయులు మాత్రం ఈ నెల 28 (రేపు) నుంచే పాఠశాలలకు వెళ్లాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు పాఠశాలలకు వచ్చేలోగా తరగతి గదులు, పాఠశాల ప్రాంగణాలు శుభ్రం చేయించాలని, 29న తల్లిదండ్రుల కమిటీలు, ఇతర ప్రభుత్వా విభాగాలతో సమావేశాలు నిర్వహించాలని పేర్కొంది. జులై 5న విద్యార్థులకు విద్యా కానుకల కిట్లను పంపిణీ చేయాలని ఉపాధ్యాయులను విద్యాశాఖ ఆదేశించింది.