ఒకే ఆట-ఒకే బాట...ప్రేమించినవాడితోనే సైనా పెళ్లి.. - MicTv.in - Telugu News
mictv telugu

ఒకే ఆట-ఒకే బాట…ప్రేమించినవాడితోనే సైనా పెళ్లి..

September 26, 2018

భారత షట్లర్ సైనా నెహ్వల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఆమె  బ్యాడ్మింటన్ కోస్టార్ పారువల్లి కశ్యప్‌ను పెళ్లి చేసుకోనుంది. గత కొంతకాలంగా ఈ జంట ప్రేమలో మునిగి తేలుతోంది. దీంతో వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో  డిసెంబర్ 16న పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. పెళ్లిని అతికొద్ది మంది సమక్షంలో చేసుకోబోతున్నారు. డిసెంబర్ 21న భారీ రిసిప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ రిసిప్షన్‌కు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడెమీలో 2005 నుంచి వీరిద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.Badminton stars Saina, Kashyap to tie the knot in Decemberఇషాంత్ శర్మ- ప్రతిమా సింగ్, దీపికా పల్లికల్- దినేశ్ కార్తీక్, గీతా పొగత్- పవన్ కుమార్‌లలా వీరు కూడా క్రీడా జోడీగా ఒక్కటి కానున్నారు.