చెరువు కనిపించిందటే అక్కడ కాసేపు ఆగాలినిపిస్తోంది. కానీ ఆ చెరువుని చూస్తే భయపడుతున్నారు. అటు వైపు వెళ్లాలంటేనే దడుసుకుంటున్నారు. ఎగిసిపడుతున్న విషపూరిత నురగ వారిని వణికిస్తోంది. ఎందుకిలా..
బెంగుళూర్లో వర్తూర్ చెరువు నుంచి విషపూరితమైన నురగ ఎగిసిపడుతుంది. తెల్లటి నురగ భారీగా వ్యాపిస్తోంది. దీంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషపూరిత నురగతో చర్మవ్యాధులు వస్తున్నాయి. కార్ల అద్దాలపై నరుగపడటంతో వాహనదారులు డ్రైవింగ్ చేయలేకపోతున్నారు. పారిశ్రామిక వ్యర్థాల వల్లే చెరువు కలుషితమవుతుంది. అయినా కర్నాటక సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు